న్యూఢిల్లీ :
చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, ఆయన్ను ఎలా అయినా అవినీతి కేసుల్లో ఇరికించాలని, సోలార్, విండ్ ఎనర్జీ విషయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పై కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ సమీక్ష చేస్తాం అంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే దీని పై విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు మండి పడ్డాయి. ప్రధానికి ఫిర్యాదు చేసినా, చివరకు కేంద్ర మంత్రి చెప్పిన వినలేదు. చివరకు కోర్ట్ లలో విషయం ఉంది. ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ఇలాంటి చర్యలతో, మా పెట్టుబడులకు ఇబ్బంది అని, మీ దేశంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టం అంటూ హెచ్చరించాయి. ఇదే విషయం పై దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కూడా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ విషయం పై నిలదీసారు. ఒక ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం మరో ప్రభుత్వం మారగానే ఎలా సమీక్ష చేస్తారు? ఇలా అయితే ఎవరూ పెట్టుబడులు పెట్టరు అంటూ నిలదీశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం పై ఇంపాక్ట్ పడింది అని గ్రహించిన కేంద్రం ప్రభుత్వం, మన దేశంలో విద్యుత్ రంగంలో చేసుకున్న ఒప్పందాలకు భద్రత కల్పించేలా కీలక అడుగులు వెయ్యటానికి నిర్ణయం తీసుకుంది. ఒప్పందాలు కనుక ఉల్లంఘన జరిగితే వారి పై చర్యలు తీసుకునే విధంగా ప్రత్యెక ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యటానికి నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి అదనంగా చట్ట భద్రత కలిగించేందుకు ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చెయ్యాలని కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనశాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ దిశగా ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని దీని పై త్వరలోనే కీలక అడుగులు వేస్తారని సమాచారం. రాష్ట్రాలు అన్నీ ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చేలా 2003 విద్యుత్ చట్టానికి సవరణలు చేసి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బిల్లు పెడుతుందని అధికారులు చెప్తున్నారు. రిటైర్డ్ జడ్జి, ఈ ట్రిబ్యునల్ కు సారధ్యం వహిస్తారని, రాష్ట్రాలు అన్నీ ఈ ట్రిబ్యునల్ పరిధిలో పని చేస్తాయని అంటున్నారు. దేశం అంతటా ఈ ట్రిబ్యునల్ కు శాఖలు ఉంటాయి. విద్యుత్ ఒప్పందాలు అన్నీ ట్రిబ్యునల్ పర్యవేక్షణ చేస్తుంది. ఒప్పందం ప్రకారం విద్యుత్ కొనేందుకు నిరాకరిస్తే ఆ రాష్ట్రాల డిస్కమ్‌లు ఆస్థులు జప్తు చేసి ఒప్పందం విలువకు సరిపడా మొత్తాన్ని రాబట్టగల అధికారులు, ఈ చట్టం ద్వారా, ట్రిబ్యునల్ కు రానుంది. దీంతో రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు చెయ్యటం కుదరదు. ఏపిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో అలెర్ట్ అయిన కేంద్రం ఈ కొత్త చట్టం తీసుకు రానుంది.పునఃసమీక్షించాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశమయిన సంగతి తెలిసిందే.
Post a Comment