కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా వేద పండితులచే శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిషేకములు సాయంత్రం 6 గంటల నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం రాత్రి 10:30 గంటలకు ఇరవై ఒక్క రకాల విశేష ద్రవ్యములతో అభిషేకము మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం ముందు మహా నీరాజనం మంత్రపుష్పం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు శివరాత్రి పర్వదినాన 108 లీటర్ల పాల తో శివలింగానికి అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఇట్టి శివరాత్రి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని కృప కు పాత్రులు కాగలరని శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షులు తెల్ల అంజయ్య తెలిపారు.
Post a Comment