ఏపీలోని పదమూడు జిల్లాల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం పలు తీర్మానాలు చేసింది. రాజధాని మార్చాలన్న ప్రకటనతో మానసిక వేదనతో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని, రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ పర్యటన చేయాలని, మహిళలను డ్రోన్ తో చిత్రీకరించారనే ఆరోపణలపై విచారణ చేయాలని, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, అమరావతి ఉద్యమంలో పెట్టిన కేసులన్నీ, రాజధాని మహిళలపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని తీర్మానించింది.
Post a Comment