'భోగాపురం' ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ పై విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్‌

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేస్తోన్న ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిధిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగింది అని చేతగాని దద్దమ్మ మాటలు ఎందుకు విజయసాయిరెడ్డి గారూ? జగన్ అధికారంలో ఉన్నారు అని మీరే నమ్మలేకపోతున్నట్టు కనిపిస్తుంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినప్పుడు 8 నెలల్లో గడ్డి పీకారా?’ అని ప్రశ్నించారు. ‘అయినా ఫర్వాలేదు భోగాపురంలో ట్రేడింగ్ పై మేము విచారణకు సిద్ధం. 8 నెలల కాలంలో జగన్ గారు, మీరు విశాఖ నుండి మొదలు పెట్టి భోగాపురం వరకూ చేసిన ల్యాండ్ మాఫియా పై విచారణకి సిద్ధమా విజయసాయిరెడ్డి గారు?’ అని బుద్ధా ట్విట్టర్‌ లో సవాలు చేసారు .

 

0/Post a Comment/Comments

Previous Post Next Post