కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా శుక్రవారం గన్నేరువరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తల నాదే రక్షణ నాదే అనే నినాదంతో ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకం పై బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం మండలకేంద్రంలో హెల్మెట్ వాడకం పైన అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు ఎస్సై తిరుపతి మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని వాహనదారులు అందరు గమనించి తప్పకుండా హెల్మెట్ వాడాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ చేయడం నేరం అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు న్యాత సుధాకర్, బొడ్డు సునీల్, బుర్ర అంజయ్య గౌడ్,పుల్లెల సాయి కృష్ణ, బోయిని మల్లయ్య,బూర శ్రీనివాస్, బుర్ర తిరుపతి గౌడ్,బొడ్డు భూపతి, గూడూరి రాజయ్య,బోయిని పోశెట్టి ,చిగురు అంజయ్య, గర్షకుర్తి లక్ష్మణ్, కాంతల అంజి రెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు వివిధ యువజన సంఘాల సభ్యులు, వాహనదారులు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
Post a Comment