కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను కేటీఆర్ శుక్రవారం ఉదయం కలిశారు .ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో జరిగే బయో ఆసియా సదస్సుకు కేంద్రమంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. అలాగే వరంగల్-హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్ – నాగ్‌పూర్ రెండు కొత్త కారిడార్‌లు మంజూరు చేయాలని, హైదరాబాద్-బెంగళూర్- చెన్నైను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విన్నవించారు. ఇదే అంశంపై దక్షిణాది మంత్రులకు ఇప్పటికే లేఖలు కూడా రాశామని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
అలాగే మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన అంశాలపైన వెంటనే ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా తన కార్యాల సిబ్బందిని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ కోరారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment