ప్రజలు ప్రత్యేకించి యువత ఏ ప్రయోజనం కోసం పోరాడిన జాతిపిత మహాత్మ గాంధీ ప్రబోధించిన అహింస మంత్రాన్ని గమనంలో ఉంచుకొని పోరాడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. మహాత్మ ఉపదేశించిన శాంతి-అహింస మంత్రం మానవత్వానికి అమూల్యమైన బహుమతి అని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన దేశ ప్రజలనుద్దేశించి సందేశమిచ్చారు. జాతి నిర్మాణంలో మహాత్మాగాంధీ ఆలోచనలు ఈ నాటికీ సంపూర్ణంగా ఆచరణీయమేనని తెలిపారు. గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింస సందేశం మన కాలంలోనే ఇంకా ఎక్కువ అవసరమని కోవింద్ అన్నారు. ప్రజలు ప్రత్యేకించి యువత ఏ ప్రయోజనం కోసం పోరాటం సాగించినా గాంధీజీ మంత్రమైన అహింసను గమనంలో ఉంచుకోవాలన్నారు. విజ్ఞానమే గొప్పది..
అధికారం, ఖ్యాతి, ధనం కంటే విజ్ఞానమే గొప్పది అని ఆయన ఉద్ఘాటించారు. స్వతంత్ర ప్రజాస్వామ్య పౌరులుగా మనకు మన రాజ్యాంగం కొన్ని హక్కులను ఇచ్చిందని, అయితే అదే రాజ్యాంగంలో బాధ్యతలను తెలిపిందన్నారు. ప్రజాస్వామ్య ప్రాథమిక నియమాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యాక్రమాలు చేపట్టిందని వివరిస్తూ ఈ కార్యక్రమాల్లో ఉద్యమస్ఫూర్తితో స్వచ్ఛందంగా పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. భారత్‌లో విజ్ఞానాన్ని ఎల్లప్పుడూ అధికారం, ఖ్యాతి, ధనం కంటే విలువైనది పరిగణిస్తారని తెలియ చేసారు .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment