కరోనా వైరస్ రోజురోజుకు విభృంభిస్తుండటంతో హాంకాంగ్ సీఈవో క్యారీ లామ్ శనివారం నగరంలో ”అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీని ప్రకటించారు. అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించే లక్ష్యంతో చర్యలు చేపట్టారు. అలాగే ఆరోగ్య అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ఇప్పటివరకు హాంకాంగ్‌లో ఐదుగురికి వైరస్ సోకినట్టు తేలగా, మరో నలుగురికి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తేలింది. దీంతో తదుపరి ఆదేశాల వెలువడే వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మూసివేయాలంటూ క్యారీ లామ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఆరోగ్య సంక్షోభంపై సత్వర చర్యలు తీసుకునేందుకు ఇంటర్ డిపార్ట్‌మెంటల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామనీ, దాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని లామ్ పేర్కొన్నారు. కాగా, మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా వచ్చే నెల 9 న జరగాల్సిన ప్రఖాత్య స్టాండర్డ్ చార్టర్ హాంకాంగ్ మారథన్ కూడా వాయిదా వేసినట్టు పేర్కొన్నారు.చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. వుహాన్ సహా, హుబే ప్రానిన్స్‌లోని ఈ వైరస్ బారిన పడి 41 మంది మృతి చెందగా, మరో 1287 మందికి ఈ వైరస్ వ్యాపించిందని అధికారులు తెలిపారు. చైనాలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ ఈ వ్యాధి రేపుతున్న కల్లోలం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసాధారణ రీతిలో కొత్త సంవత్సరం వేడుకల్ని చైనా సర్కార్ రద్దు చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా 1300 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ వైరస్ భారత్‌నూ భయపెడుతున్నది. ఈ వైరస్ యూరప్‌లో కూడా వ్యాప్తి చెందినట్టు వార్తాలు వస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్టు ప్రభుత్వం ధ్రువీకరించింది. మరోవైపు హుబే ప్రానిస్స్‌లో పర్యటించడాన్ని నిషేదించారు. దీంతో 10 నగరాల్లో దాదాపు 2 కోట్ల మరది ఇండ్లకే పరిమితమయ్యారు. వుహాన్‌లో కరోనా పీడితులకు వైద్య సేవలందించేందుకు ఆర్మీ మెడికల్ సిబ్బందిని హుటాహుటిన పంపారు. మాస్క్‌లు, మందులు, ఆహార సామాగ్రిని పెద్దయెత్తున పంపినట్లు అధికారులు తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment