పోలీస్ వాహనానికి ఫైన్ వేయించిన సామాన్యుడు

గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝలిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే సామాన్యులు కూడా అదే రేంజ్‌లో పోలీసులకు షాక్ ఇస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వెహికల్స్ కానీ, అధికారులుగానీ ట్రాఫిక్ నియమాలు పాటించకుండా రోడ్డుపై కనిపిస్తే, వెంటనే ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. పైగా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ, హైదరాబాద్‌ పోలీసుల అఫిషియల్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తున్నారు.
తాజాగా అలాగే ఓ పోలీస్ వాహనం ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించి సామాన్యుడి కంట పడింది. వెంటనే అతడు ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో కాస్తా రాచకొండ కమిషనరేట్‌కు చేరింది. ఫైన్ వెయ్యకపోతే తేడా వస్తుందని భావించిన పోలీసులు సదరు వాహనానికి భారీగానే వడ్డించారు. టీఎస్‌09 పీఏ 4083 నెంబర్‌గల పోలీస్ వెహికల్‌కి రూ.1135 ఫైన్ వేశారు. ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలని ఆ ఫోటోని షేర్ చేసిన నెటిజన్లు, ఇప్పుడు ఫైన్ వెయ్యడంతో ఇది తమ విజయం అంటూ పోస్ట్‌లతో తెగ హెరెత్తిస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post