అందాల కథానాయికగా .. రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా జయలలిత జీవితంలో అనేకమైన అనూహ్యమైన మలుపులు వున్నాయి. అలాంటి జయలలిత బయోపిక్ ను దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ టైటిల్ తో రూపొందిస్తున్నాడు. విష్ణువర్ధన్ .. శైలేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కంగనా నటిస్తోంది. శిక్షణ తీసుకుని మరీ కంగనా ఈ పాత్రను పోషిస్తోంది. సినిమాల పరంగాను .. రాజకీయాల పరంగాను ఎంజీఆర్ తో కలిసి జయలలిత ఎక్కువ దూరం ప్రయాణం చేశారు. అందువలన ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్ర కూడా కీలకమే. ఈ కారణంగానే ఈ పాత్రకి అరవింద్ స్వామిని తీసుకున్నారు. ఈ రోజున ఎంజీఆర్ జయంతి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఎంజీఆర్ గా అరవిందస్వామి ఫస్టు లుక్ ను విడుదల చేశారు.
Post a Comment