సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహంలో అనంతపురం టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి .. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నారు. కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలీస్ కేసులు, దివాకర్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ దాడులను కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాగా ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను జేసీ కలిశారు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం ఫిబ్రవరిలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. అయితే జేసీ వర్గీయులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment