విశాఖ ఏజెన్సీలో 48 గంటల బంద్‌కు గిరిజన జేఏసీ పిలుపు

గిరిజన చట్టాల అమలు, గిరిజన హక్కుల పరిరక్షణ, 1/70 యాక్ట్ చట్టం పట్టిష్టంగా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. రెండు రోజుల (సోమ, మంగళవారం) బందుకు పిలుపునిచ్చింది.  విశాఖ ఏజెన్సీలో 48 గంటల బంద్‌కు గిరిజన జేఏసీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని స్కూల్స్‌కు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. అలాగే 8వ తేదీన సకలజనుల సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా మూడు రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో బంద్ జరగనుంది. మూడు రోజుల బంద్‌లో బస్సులు, వాహనాలు తిరిగేందుకు అనుమతించబోమని గిరిజన జేఏసీ నాయకులు తెలిపారు. గత రెండు నెలలుగా పర్యాటకులతో, స్థానికులతో ఎంతో సందడిగా కనిపించిన అరకులోయ ఒక్కసారిగా బోసిపోయింది. బంద్ విషయం తెలియక చాలామంది పర్యాటకులు అరకులోయలో చిక్కుకుపోయారు. బస్సులు తిరగకపోవడంతో తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు.
బంద్ సందర్భంగా అరకులోయలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హోటల్లు, లాడ్జిలు, సినిమా హాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌కు గిరిజన జేఏసీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

Post a Comment

Previous Post Next Post