కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గా మర్రి వెంకటమల్లు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శనివారం కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి పదకొండు మంది సభ్యులతో కలిసి ఎన్నుకున్నారు చైర్మన్ గా మర్రి వెంకటమల్లు వైస్ చైర్మన్ గా పేరం కొమురయ్య కోశాధికారిగా మొలుగు సంపత్ సభ్యులుగా విలాసాగరం రామచంద్రం, బుర్రరాములు దొగ్గలి రాములు ,తోట రాజేశం నాగవెల్లి లక్మీ రాజం, బుర్ర శ్రీనివాస్ ,కుంట లక్మన్ ,నేరెల్ల నరేష్ లను నూతన కమిటీలో సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మర్రి వెంకటమల్లు మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగ నిరవేరుస్తానని పేర్కొన్నారు సమష్టిగా పనిచేసి జాతరను కనీవిని ఎరగని రీతిలో అంగరంగ వైభవంంగా నిర్వహిస్తానని పిలుపునిచ్చారు
Post a Comment