తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధుకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. మరో నలుగురు తెలుగు వారిని పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి.. చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయం), కరీంనగర్ జిల్లా వాసి, ప్రముఖ సంస్కృత పండితులు, కవి, విమర్శకులు విజయసారథి శ్రీభాష్యం (విద్య). ఆంధ్రప్రదేశ్ నుంచి ఎడ్ల గోపాలరావు (కళారంగం), దలవాయి చలపతిరావు( కళారంగం). అదేవిధంగా ఈ ఏడాది వాణిజ్యం, పరిశ్రమలు విభాగంలో ఇద్దరికి పద్మభూషన్ పురస్కారాలు లభించాయి. అందులో ఆనంద్ మహీంద్రా (మహారాష్ట్ర), వేణు శ్రీనివాసన్ (తమిళనాడు).
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment