కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రైతు కాంతల రాజిరెడ్డి (60)సం గురువారం తెల్లవారుజామున 4 30 ప్రాంతంలో ఇంటి దగ్గర లో ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు మోటార్ వేయడానికి వెళుతుండగా రెండు ఎలుగుబంట్లు దాడి చేశాయి . దీంతో రైతు రాజిరెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి . కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతము చికిత్స పొందుతున్నాడు. బాధితుడ్ని ప్రభుత్వ పరంగ ఆదుకోవాలని , ఉదయాన్నే రైతులు పొలం దగ్గరకి వెళ్లాలంటే భయాందోళనకు గుతయూత్న్నామని .. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
Post a Comment