పాకిస్థాన్ కు చెందిన అద్నాన్ సమీ భారత్ లో ఉంటూ ఇక్కడి ప్రభుత్వాన్ని కాకా పట్టడం వల్లే పద్మశ్రీ ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. సమీ ఓ పాకిస్థాన్ వాయుసేన అధికారి కుమారుడని, అతనికి ఎలా పద్మ అవార్డు ఇస్తారని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్ గిల్ ప్రశ్నించారు. దీనిపై అద్నాన్ సమీ ఘాటుగా బదులిచ్చారు. “ఓయ్ బాబూ, మీ బుద్ధిని క్లియరెన్స్ సేల్ లో చవకగా కొనుక్కుని వచ్చారా? లేక ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ దుకాణం నుంచి తెచ్చుకున్నారా? తల్లిదండ్రుల పేరుచెప్పి పిల్లల్ని బాధిస్తారా ఎక్కడైనా? మీరో లాయర్, మీకు లా కాలేజీలో ఇదే నేర్పారా?” అంటూ స్పందించారు. పాకిస్థాన్ కు చెందిన అద్నాన్ సమీ ప్రఖ్యాత గాయకుడు. సమీ గాత్ర మాధుర్యానికి దేశాల ఎల్లలు కూడా చెరిగిపోయాయి. ఆయన తెలుగులోనూ అనేక హిట్ గీతాలు పాడి ఇక్కడి ప్రేక్షకులకు కూడా అభిమాన పాత్రుడయ్యారు. అద్నాన్ సమీని కేంద్రం మహారాష్ట్ర వాసిగా పరిగణనలోకి తీసుకుని పద్మశ్రీ ప్రకటించినట్టు తెలుస్తోంది
Post a Comment