అనంతపురం జిల్లా యాడికి ప్రాంతంలోని త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన త్రిశూల్ సిమెంట్ సంస్థకు కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలో సున్నపురాతి గనులను గతంలో లీజుకిచ్చారు. ఇప్పుడా లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ఆంక్షల కొరడా ఝుళిపించిన సర్కారు మరోసారి కటువైన నిర్ణయం తీసుకోవడం జేసీ కుటుంబానికి మింగుడుపడని విషయమే!
Post a Comment