చైనాను కబళిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రమేపీ తన ప్రతాపాన్ని చూపుతోంది. చైనాలో ఇప్పటికే ఈ వైరస్ వ్యాధి సోకి మరణించినవారి సంఖ్య 80 కి పెరగగా.. సుమారు రెండున్నరవేల మంది దీని ప్రభావానికి గురయ్యారు. కాగా.. ఇండియాలో వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమయింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు మన దేశంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి పాజిటివ్ కేసు కూడా కనబడలేదన్నారు. చైనా నుంచి వచ్చిన ఏడుగురు ప్రయాణికుల రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు ఆయన చెప్పారు. అలాగే ఇరవై నాలుగు గంటలూ ఓ కాల్ సెంటర్ పని చేస్తోందన్నారు. ఈ నెల 1 నుంచి చైనాకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరైనా జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ రుగ్మతలతో బాధ పడుతుంటే వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని హర్ష వర్ధన్ కోరారు. ఇక ఢిల్లీ సహా ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చి , కోల్ కతా, చెన్నై విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశారు.ఇలా ఉండగా కేరళ, మహారాష్ట్రలో సుమారు రెండు వందల మందిని ముందు జాగ్రత్త చర్యగా ]అబ్జర్వేషన్ లో ఉంచారు. కేరళలో 172 మందిని హోం నిఘాలో ఉంచగా.. ఏడుగురిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. చైనా నుంచి పాట్నా చేరిన ఒక అమ్మాయిని, అలాగే ఆ దేశం నుంచి రాజస్తాన్ కు వఛ్చిన ఓ డాక్టర్ ను కూడా ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి తరలించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment