ఆఫ్గానిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ‘అరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఆఫ్ఘనిస్తాన్ ఘజ్ని ప్రావిన్స్ లోని తాలిబాన్ ఆధీకృత ప్రాంతంలో సోమవారం ప్రయాణీకులతో వెళ్తున్న విమానం కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు’ అని ఘజ్ని గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి అరిఫ్ నూరి తెలిపారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఈ విమానం కూలినట్లు తెలుస్తోంది. ఏదైనా సాంకేతిక లోపం వల్ల విమానం కూలిందా లేదా తాలిబన్లు ఈ ఘాతుకానికి తెగబడ్డారా అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment