ఇండోనేసియాలోని జకార్తా భారీ వర్షాల కారణంగా అక్కడి నదులు వరదలతో పోటెత్తాయి. దేశ ప్రజలందరూ కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిన వేళ్ల విరుచుకుపడిన ఈ వరదల్లో 9 మంది మరణించగా అనేక మంది జాడ తెలియటం లేదని అధికారులు తెలిపారు. ఈ వరదలతో దాదాపు 90 నైబర్‌హుడ్‌లు నీట మునిగాయని, జకార్తా నగర సరిహద్దుల్లోని దెపోక్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ ప్రతినిధి అగస్ విబోవో చెప్పారు. మృతులలో విద్యుద్ఘాతంతో మరణించిన ఒక 16 ఏళ్ల విద్యార్థి కూడా వున్నాడని ఆయన వివరించారు. అనేక ప్రాంతాలలో వరదనీరు మూడు మీటర్ల పై ఎత్తు రావటంతో, 19 వేల మందికి పైగా ప్రజలను తాత్కాలిక సహాయ శిబిరాలకు తరలించామన్నారు. వరదల కారణంగా వేలాది మంది నిర్వాసితులు కాగా, జకార్తా విమానాశ్రయంలోకి నీరు ప్రవేశించటంతో తాత్కాలికంగా మూసివేశారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చేందుకు సిద్ధమవుతున్న జకార్తా వాసులు ఈ ఆకస్మిక కుంభవృష్టితో తడిసి ముద్దయ్యారు. బుధవారం ముంచెత్తిన
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment