ఎపి రాజధాని పై కోర్టులో పిటిషన్లు - సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసుల తీరుపై రైతులు మండిపడుతోన్న విషయం తెలిసిందే. రాజధాని కోసం నిరసన దీక్షలకు దిగుతోన్న రైతులు, మహిళలపై వారి తీరు పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. విజయవాడ, రాజధాని గ్రామాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయడంపై హైకోర్టులో పలువురి నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు న్యాయమూర్తులు ఈ రోజు విచారణ జరుపుతున్నారు. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీసుల యాక్టు 30 అమలుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విషయాలపై రాజధాని మహిళలు, న్యాయవాదులు, రైతులు  మొత్తం ఏడు పిటిషన్లు వేశారు. వీటిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటాగా స్వీకరించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post