తెలంగాణ భవన్‌లో 71వ గణతంత్ర వేడుకలు : జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

 హైదరాబాద్‌: భాగ్యనగరంలో 71వ గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఇక గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ బాబా ఫసియుద్దీన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం అధికారులు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులు, వృద్ధులకు వీల్‌చైర్స్‌, చేతి కర్రలు పంపిణీ చేశారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Post a Comment

Previous Post Next Post