పబ్లిక్‌ గార్డెన్‌లో వైభవంగా 71వ గణతంత్ర వేడుకలు : జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

కొత్త చట్టాలతో అవినీతి రహిత రాష్ట్రంగా పేరు గాంచిన తెలంగాణ ప్రజల పనుల్లో ఆలస్యం కాకుండా సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామాలు సత్ఫలితాలను సాధించాయన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేని స్వచ్ఛమైన రెవెన్యూ పాలన అందించాలని నిర్ణయించామన్నారు. మిషన్‌ భగీరథ, 24 గంటల కరెంటు, కొత్త ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో సాగు, తాగు నీరందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జైహింద్‌, జై తెలంగాణ అంటూ తెలుగులో ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌, మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో 71వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. పబ్లిక్‌ గార్డెన్‌లో ఆదివారం ఉదయం గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ​కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగిస్తూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎ‍న్నో రకాల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిగమించారని ప్రశంసించారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ  మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post