అండర్-19 ప్రపంచకప్ కోసం ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 17న యువ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర సమరానికి తెర లేవనుంది. నాలుగు గ్రూపులు.. 16 జట్లు టైటిల్ కోసం పోటీపడబోతున్నాయి. రెగ్యులర్ జట్లతో పాటు అర్హత పోటీల ద్వారా కొత్తగా ప్రవేశించిన ఐదు జట్లు కూడా టోర్నమెంట్‌లో అదనపు ఆకర్షణగా నిలవబోతున్నాయి..2018లో జరిగిన ఆ టోర్నీలో ఆడిన యువ జట్టులో ఇప్పుడు చాలామంది స్టార్లుగా మారారు. పృథ్వీ షా ఏకంగా టెస్టు జట్టులో, శుభ్‌మన్ గిల్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే రియాన్ పరాగ్, శివమ్ మావి, కమలేశ్ నాగర్‌కోటి, ఇషాన్ పోరెల్, అనుకూల్ రాయ్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్, మనోజ్ కల్రా ఐపీఎల్‌లో కీలకంగా మారారు. అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ చక్కటి మార్గదర్శకత్వం కూడా జట్టును అజేయంగా మార్చింది.ఈసారి భారత యువ సారథిగా యూపీ కుర్రాడు ప్రియం గార్గ్‌ను ఎంపిక చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment