శేరిలింగంపల్లి సర్కిల్ -20 కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యాదయ్య, అసిస్టెంట్ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ భవనానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తానని చెప్పి యజమాని వద్ద యాదయ్య, సాయి లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను భవన యజమాని సంప్రదించారు. అయితే గతంలోనే యాదయ్య, సాయి ఆ వ్యక్తి నుంచి రూ. 15 వేలు తీసుకున్నారు. మరో రూ. 15 వేలు ఇస్తేనే ఆస్తి పన్ను తగ్గిస్తామని చెప్పి లంచం డిమాండ్ చేశారు. ఆ రూ. 15 వేలు తీసుకుంటుండగా యాదయ్య, సాయిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment