రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లి సర్వీస్ రోడ్డు సమీపంలో దిశను దహనం చేసిన ప్రాంతంలోనే నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో ఎన్ కౌంటర్ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గ దర్శకాలను పోలీసులు పాటించలేదని వారు అందులో పేర్కొన్నారు.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment