కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షుడిగా మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ దుడ్డేల లక్ష్మీనారాయణను నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈనెల 4న బుధవారం చిగురుమామిడిలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఎంపికకై బూత్ అధ్యక్షులు, క్రియాశీల సభ్యుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగిందని, అట్టి సమావేశంలో 14 మంది నాయకులు, కార్యకర్తలు మండల అధ్యక్షుడి స్థానానికి పోటీల ఉండడంతో వారి మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలిపారు.బిజెపి నియోజకవర్గ కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామానీ నాయకులు చెప్పినందున లక్ష్మీనారాయణ నియమించినట్లు వివరించారు.
తన నియామకానికి సహకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి, జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావుకు, నియోజకవర్గ వర్గ ఇంచార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా సమన్వయకర్త కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి కార్యకర్తలకు నాయకులకు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
బిజెపి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా…
చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టిందని, కార్యకర్తల సంక్షేమం కోసం, ప్రజల కోసం నిరంతరం పని చేస్తానని వారు తెలిపారు
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment