జమాబంది నిలిపివేయాలని తాసిల్దార్ కు వినతి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామ పరిధిలోని బండారిపల్లెకు చెందిన బండారు శ్రీనివాస్ రెండెకరాల ఇరువై గుంటల భూమిని తల్లిదండ్రులు మోసం చేసి చెల్లి పేరిట,తల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితుడు శుక్రవారం తాసిల్దార్ డిండిగాల రవీందర్ కు వినతి పత్రం అందజేశారు.శ్రీనివాస్ కు బొమ్మనపల్లి గ్రామ శివారులోని 567 సర్వేనెంబర్ లో రెండెకరాల ఇరువై గుంటల భూమి తనకు పట్టాకు ఉందని,విషయం చెప్పకుండా తనతో రిజిస్టర్ చేసుకొని మోసం చేశారని బాధితులు తహసీల్దార్ ముందు కంటతడి పెట్టారు.అట్టి జమా బంధిని వెంటనే నిలిపివేయాలని తాసిల్దార్ కు విన్నవించారు.ఏమి తెలియని అమాయకూడు శ్రీనివాస్ ను తల్లిదండ్రులు మోసం చేసి శ్రీనివాస్ అక్క చెల్లెలుకు రిజిష్టర్ చేసి మోసం చేశారని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళ సంఘల మహిళ లు కోరారు.ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని, అయ్యప్ప మహిళా సంఘాల బాద్యులు బండారి రధవ్వ,లత , వినోద,లచ్చవ్వ, విమలవ్వ,సర్వవ్వ,ఎల్లవ్వ,అం జవ్వ,వసంత,బండారు లత తదితరులు ఉన్నారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

0/Post a Comment/Comments

Previous Post Next Post