క్రికెట్ ను కమెర్షియల్ చేసే యోచనలో ముందడుగు వేయనున్న ICC. అందులో భాగంగా ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే2023లో తీసుకురావాలనే నిచ్చయంతో ఉంది. త్వరలోనే దీనిపై ఓ కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. బీసీసీఐ ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నిర్ణయం కొత్త తీసుకుంది కాదు గతంలో ఇంగ్లాండ్ , ఐర్లాండ్ మధ్య నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లోనూ సౌతాణాఫ్రికా, జింబాబ్వేలు జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ నిర్వహించింది. ఈ మ్యాచ్‌లు సక్సెస్ కావడంతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ దిశగా ఐసీసీ అడుగులు వేస్తోంది. క్రికెట్ ఆడే పలు దేశాల్లో టీ20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్ లో మరిన్ని టెస్టు మ్యాచులు ఆడే అవకాశం ఉంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment