న్యూ ఇయర్ నైట్ : కంట్రీ క్లబ్ లో హై డ్రామా

 సినీ నిర్మాత నట్టికుమార్ కుమారుడు క్రాంతిపై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై అర్థరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గంటన్నరపాటు హైడ్రామా నడిచింది. బేగంపేట్ కంట్రీ క్లబ్ ఈవెంట్ మేనేజర్ సుమన్ ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్‌కు రావాలంటూ బ్యూటిఫుల్ సినిమా టీంకి ఆహ్వానం పంపారు. అయితే రాంగోపాల్ వర్మ స్థాయికి తగిన విధంగా సెలెబ్రేషన్స్‌ని ఏర్పాటు చేయకపోవడంతో.. ప్రోగ్రామ్‌ని క్యాన్సెల్ చేసుకుంది టీం. ఈ క్రమంలో తన కారును కనపడకపోవండతో.. డయల్ 100కి ఫోన్‌ చేసి సహాయం అడిగారు. అయితే.. సహాయం అడిగినందుకు తన కొడుకుపై పోలీసులు దాడి చేశారంటూ నట్టికుమార్‌ ఆరోపిస్తున్నారు.అంతకుముందు కంట్రీక్లబ్‌లో జరిగిన వివాదాన్ని క్రాంతి కెమెరాలో రికార్డు చేశారు. ఈవెంట్ల పేరుతో మోసం చేస్తోన్న కంట్రీ క్లబ్ మేనేజర్‌ సుమన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నట్టికుమార్. వర్మ పేరుతో పబ్లిసిటీ స్టంట్ పేరుతో ప్రమోషన్స్ చేసుకోవాలని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సుమన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడిపై దాడి ఘటనకు పోలీసులు క్షమాపణ చెప్పారన్నారు నిర్మాత నట్టికుమార్.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post