కష్టపడి పనిచేశాను..నా కూలి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగిన పాపానికి జేసీబీతో తొక్కించి అంత్యం దారుణంగా చంపేసిన ఘటన యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణంగా స్థానికంగా కలకలం సృష్టించింది.రాణీగంజ్ కైథెలా గ్రామానికి చెందిన శ్రీనాథ్ సరోజ్ కుమారుడు విపిన్ సరోజ్ అనే 18 సంవత్సరాల యువకుడు అదే ప్రాంతంలో ఉంటున్న వికాస్‌సింగ్‌కు చెందిన జేసీబీని డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పని చేసిన తరువాత యజమాని వికాస్‌సింగ్ ను బుధవారం (డిసెంబర్ 4) తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. దీంతో ఆగ్రహించిన వికాస్ సింగ్ సరోజ్ ను నానా మాటలు అన్నాడు.బూతులు తిట్టీడు. పనిచేయగానే డబ్బులెందుకు ఇవ్వాలంటే అరిచాడు. జెసీబీతో విపిన్ సరోజ్‌ను తొక్కించాడు. అంతటితో ఊరుకోలేదు. విపిన్ ను జేసీబీతో తొక్కించి చంపేశాడు. దీంతో సరోజ్ అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం వికాస్ అక్కడి నుంచి పారిపోయాడు.కొడుకు చావు గురించి తెలుసుకున్న అతని తల్లిదండ్రులు ఘటనాస్థలానికి పరుగు పరుగున వచ్చారు. గుండెలు అవిసేలా ఏడ్చారు. సరోజ్ చావు స్థానికంగానే కాదు చుట్టు పక్కల గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. వికాస్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విపిన్ సరోజ్ మతదేహంతో లక్నవారణాసి రహదారిపై ఆందోళన చేపట్టారు. దళితులమనే చులకన భావంతో కష్టపడి పనిచేసిన డబ్బులు అడిగినందుకు తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని వాపోతూ..తమకు న్యాయం చేయాలని వికాస్ సింగ్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి తండ్రి శ్రీనాథ్ సరోజ్ మాండ్ చేశాడు. అతనికి మద్దతుగా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా నిలిచారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంనకు తరలించారు. వికాస్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment