ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు రెండు రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా ప్రతిపక్ష నేతలు, తోటి రైతులు నిలిచారు. ఈ సందర్భంగా ఓ రైతు భార్య మాట్లాడుతూ, ఓ మంత్రి తమను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ విమర్శలు చేశారని, ఆ వ్యాఖ్యలు కరెక్టు కాదని ధ్వజమెత్తారు. తాము పెయిడ్ ఆర్టిస్టులం కాదు.. రైతులము అని, తమ ఆధార్ కార్డులు కూడా చూపించామని అన్నారు. ఇప్పుడు మా పొలాలను తిరిగి ఇచ్చేస్తామంటే ఏం చేసుకుంటాం. ప్రభుత్వం ఇప్పుడు మా పొలాలను తిరిగి మాకు ఇచ్చేస్తామంటే ఏం చేసుకుంటామని మరో రైతు భార్య మండిపడ్డారు. తమ పిల్లల భవిష్యత్, ముందు తరాల భవిష్యత్ బాగుంటుందనేగా నాడు తమ పొలాలను ప్రభుత్వానికి ఇచ్చిందని అన్నారు. ‘ఈ రకంగా ఏడిపిస్తున్నాడు.. కంటికి నిద్ర పడితే ఒట్టు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతం ఒక సామాజికవర్గం ప్రయోజనానికే ఉందన్న ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు. ‘మా అందరినీ కూడా ఎస్సీ, ఎస్టీలను చేయండి.. అంతకంటే చెప్పలేను’ అంటూ ఆమె విలపించారు.
Post a Comment