ఉత్తరప్రదేశ్ లోని బిజనేర్ కోర్టు హాలులోనే నిందితుడు హత్యకు గురైన ఘటనలో 18 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ వ్యాపారి హత్య కేసులో నిందితులు షానవాజ్ అన్సారీ, జబ్బర్ లను బిజనేర్ లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నిన్న విచారణకోసం హాజరుపర్చారు. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు రహస్యంగా తెచ్చుకున్న పిస్టల్స్ తీసీ నిందితులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అన్సారీ అక్కడే మృతి చెందాడు. మరో నిందితుడు జబ్బర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కోర్టు గదిలో న్యాయమూర్తి తదితరులు కూడా ఉన్నారు. అనంతరం కాల్పులు జరిపి పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు గాయాలయినప్పటికీ, ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ.. ప్రభుత్వం తాజాగా 18 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment