చొక్కారావు పల్లె లో ధాన్యం కొనుగోలు అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఇటీవల చొక్కారావు పల్లి ధాన్యం విక్రయ కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలపై పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా స్పందించిన విషయంపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార శాఖ అధికారి మనోజ్ కుమార్ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ విచారణలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు దళారులు కలిసి కొందరు మిల్లర్లతో కుమ్ముక్కై మద్దతు ప్రభుత్వ మద్దతు ధరలను చూపించి కోట్ల రూపాయలను దండుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు అయితే మండలంలోని పలు గ్రామాల నుండి ధాన్యం విక్రయించిన సదరు రైతుల నుండి సహకార సొసైటీ అధికారి మహమ్మద్ అలీ మరియు రెవెన్యూ అధికారులు కలిసి శనివారం మండలంలో విచారణ చేపట్టారు ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు పంట కొచ్చిందా అసలు భూమి ఉందా కాగా రబీ సీజన్లో విక్రయించిన మొత్తం దిగుబడి ఉందా మరియు బ్యాంకు అకౌంట్ ఉందా వంటి కోణాల్లో విచారణ జరిపారు కాగా మండలంలోని గునుకుల కొండాపూర్ కు చెందిన 17 మంది గుండ్లపల్లి నుండి నాలుగురు గోపాల్ పూర్ గ్రామం నుండి ఒకరు చొప్పున చొక్కారావు పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించినట్టుగా తెలిసింది దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందని తెలియవస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post