అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. 14500 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా జగన్ అన్నారు. అయితే, ఈ నంబరుకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫోన్ చేసి.. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ హయాంలో జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన చెప్పారు. అలాగే, జగన్ రాజకీయ అవినీతిపై కూడా అధ్యయనం చేయాలని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ లేఖ కూడా రాశారని అన్నారు. అయితే, ఈ ఫిర్యాదును సచివాలయానికి తీసుకెళ్లి అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది ఆయనకు సూచించారు. జగన్ చెప్పినట్లు తాను చేసిన ఫిర్యాదుపై కూడా 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు. తనపై తానే అధ్యయనం చేయించుకుంటానని జగన్ స్వయంగా ప్రకటించాలని ఆయన అన్నారు.
Post a Comment