హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నంబరు 3లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఓ బైకును ఢీ కొట్టడంతో, టీసీఎస్ లో పని చేస్తోన్న ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని చితక్కొట్టారు. ఆర్టీసీ తాత్కాలిక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. అతడి నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సుపై కూడా స్థానికులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలుని సోహిని సక్సేనాగా గుర్తించారు.
Post a Comment