కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ సిబ్బంది తో ఆర్డీవో ఆనంద్ కుమార్ రైతుల భూ సమస్యలపై సమీక్ష చేశారు పెండింగ్ ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు గ్రామ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు రైతుల సమస్యలపై తక్షణమే స్పందించాలని అన్నారు రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన రైతులు పెండింగ్ భూ సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు ప్రతి రైతు ప్రభుత్వం నుండి అందే రైతుబంధు రైతు బీమా వర్తించేలా చూడాలన్నారు పట్టాదారు పాసుపుస్తకాలు సవరణ ఆన్లైన్లో నమోదు సమస్యలను వెంటనే సవరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె రమేష్, డిప్యూటీ తాసిల్దారు కమోరోద్దీన్,ఆర్ ఐ లు శంకర్, శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది వీఆర్వోలు వీఆర్ఏలు పాల్గొన్నారు.
Post a Comment