ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రజలను గ్యాస్ ఛాంబర్లో బతకాలని బలవంత పెడతారా అని ప్రశ్నించింది. అ విధంగా చేసే కంటే వారిని చంపేస్తే మంచిది అంటూ.. కేంద్ర ప్రభుత్వ నిష్ర్కియాత్మక వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, ఉత్తరభారతంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న వాయు కాలుష్యంపై కోర్టు విచారణ జరిపింది. రాజధానిలో నెలకొన్న కాలుష్యంపై పరస్పర ఆరోపణలు మానాలని అపెక్స్ కోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. రెండు ప్రభుత్వాలు చర్చించి ఉమ్మడిగా పరిష్కారం చూపాలని సూచించింది. పది రోజుల్లోగా నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు శుద్ధి టవర్లను ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించింది. ప్రజలను గ్యాస్ ఛాంబర్లో జీవించాలని ఎందుకు బలవంతపెడుతున్నారు? దానికంటే వారందరినీ ఒకేసారి చంపితే ఉత్తమం. పేలుడు పదార్థాలను 15 సంచుల్లో తెచ్చి పేల్చేసి చంపేయండి. ప్రజలందరూ ఇదంతా ఎందుకు భరించాలి? ఢిల్లీలో కాలుష్యంపై ఒకరినొకరు విమర్శించుకునే ఆట నడుస్తోంది. ప్రభుత్వాల ఈ వైఖరులను చూస్తే గగుర్పాటు కలుగుతోంది’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నుద్దేశించి అన్నారు.
Post a Comment