CMRF చెక్కులు అందజేసిన యువ నాయకులు



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బూపెళ్ళి లచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం 60,000/ అరవై వేల రూ"లు చెక్కును 


అదే గ్రామానికీ చెందిన వరాల అనిల్ s./మాస్టర్ హృతిక్ కు ( 33,000/- ముప్పై మూడు వేల రూ"లు) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను యువ నాయకులు స్వయంగా వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా  నాయకులు మాట్లాడుతూ పేద  కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైన సరే కుటుంబం మొత్తం కష్టాలపాలై రోడ్డున పడుతుంది.... అలాంటి వారికి చేయూతనిచ్చేoదుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహయనిధి పథకం ఎంత గానో ఉపయోగ పడుతుందని అన్నారు 


మంజూరు కావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి ,జడ్పిటిసి సభ్యులు మాడుగుల రవీందర్ రెడ్డి కి,  టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి కి  కృతజ్ఞతలు  తెలిపారు


ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు తోట కోటేశ్వర్ మానకొండూర్ నాయకులు గుడూరి సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరుగు రాము ' టీఆర్ఎస్ నాయకులు తోట పవన్, తోట పర్శయ్య, నూకల తిరుపతి వార్డు సభ్యులు క్యాదాషి కుమార స్వామి, మర్రి పర్శరాములు, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మండల ఇంచార్జ్ కుమార్ యాదవ్, యువజన విభాగం నాయకులు మడికంటి శ్రీనివాస్, నూకల గంగరాజు, పులి రామకృష్ణ, తోట ప్రశాంత్, గంగిపెళ్ళి హరీష్ పాల్గొన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post