రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామములో నిరుపేద కుటుంబం కు చెందిన చింతకింది అనిత కుటుంబమును ఈరోజు శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి బెజ్జంకి వారు పరామర్శించడం జరిగింది. ఆమెకి కరోనా సోకి నా అన్నవాళ్ళు ఎవరు దగ్గరకు రాకపోవడంతో కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని గల్ఫ్ సేవ సమితి వేముల శంకర్ దృష్టికి తీసుకరాగా సేవ సమితి తరుపున అనిత కుటుంబానికి 16000/- రూపాయలు ఆర్థిక సహాయం చేసారు .
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గైని.సురేష్ , ఉపాధ్యక్షులు మరుపాక ఎల్లయ్య ,బోయిని సతీష్ గౌరవ అధ్యక్షులు చెట్లపెల్లి అనిల్,ప్రధాన కార్యదర్శి భాగ్యశ్రీ ,కార్యదర్శులు గుంటి శ్రీనివాస్ ,దేవసేన మీడియా ఇంచార్జ్ ఐతాబత్తుల అనుశ్రీ ,సలహాదారులు చెట్టిపెల్లి.లక్ష్మి రాజ్యం, కోశాధికారి జుట్టు. రమేష్ . ఉత్కం. తిరుపతి గౌడ్ , బామండ్ల బాబు ,తడకపెల్లి శ్రీపాల్ ,సిరిరాజ్ ,శ్రావణపేళ్ళి పర్శరాములు ,రమ్య ,నందు,బోనగిరి రాజేందర్, రాజశేఖర్, రమేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment