పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి : జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్



 కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని  బొమ్మనపెల్లి గ్రామములో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, వైకుంఠ దామం చుట్టూ జియో ఫీనిషింగ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కే.చంద్రశేఖర్ రావు తెలంగాణ పల్లెలన్ని పచ్చదనంతో, పరిశుభ్రతతో, అన్ని మౌలిక సదుపాయాలను కలిగి సకల సౌకర్యాలు సమకూర్చుతూ పల్లెలను శోభాయమానంగా తీర్చిదిద్దాలని "పల్లె ప్రగతి" కార్యక్రమాన్ని    ప్రారంభించారు గ్రామాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయిన  పనులు పూర్తి చేయబడ్డాయి. పాడుబడ్డ ఇళ్లను కూల్చడం, పాత బొందలను పూడ్చడం లాంటి కార్యక్రమాలు చేపట్టుచున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రజా ప్రతినిధుల భాద్యత ఐనప్పటికిని, పచ్చదనం, పారిశుధ్యంను నిరంతర ప్రక్రియగా సాగాలంటే ప్రజలు పల్లె ప్రగతిలో భాగసామ్యులు కావాలి

ఈ కార్యక్రమములో బొమ్మనపెల్లి సర్పంచ్ కానుగంటి భూంరెడ్డి, వార్డు  సభ్యులు విజిగిరి, గంప తిరుపతి స్పెషల్ ఆఫీసర్ ఆర్.ఐ. శైలజ, పంచాయితీ కార్యదర్శి స్వర్ణలత అంగన్వాడీ టీచర్లు అంజలి, పద్మ గ్రామ సంఘం సహాయకురాళ్లు రజిత,జ్యోతి,నిర్మల,సుజాత లు హెడ్మాస్టర్ వెంకటరమణరెడ్డితో పాటు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post