కరీంనగర్ ది రిపోర్టర్ టీవీ న్యూస్ : విశ్వబ్రాహ్మణ మరియు విశ్వఖర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ధర్మపురి కవిత ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
కరీంనగర్ పట్టణానికి చెందిన కవితను నియమిస్తూ ఇటీవల ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌన్డ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పాములపర్తి వేణుగోపాల చారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంధర్బంగా కవిత ఎమ్మెల్యే రసమయి ని కలిసి విశ్వబ్రాహ్మణ మరియు విశ్వఖర్మల సమస్యల పరిష్కారానికి మరియు సంఘం బలోపేతానికి తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని ఆమె ఎమ్మెల్యేను కోరారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను తప్పకుండా అందేలా కృషి చేస్తూ వారి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇస్తూ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కవితకు శుభాకాంక్షలు తెలిపారు.
Post a Comment