కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో జగిత్యాల నుండి వరంగల్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరియు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి గడ్డం నాగరాజు మరియు జిల్లా కార్యదర్శి గంగిపల్లి ఎంపిటిసి రంగు భాస్కరాచారి మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో టిఆర్ఎస్ పాలనలో రోడ్ల గురించి పట్టించుకున్న పాపానపోలేదు గతంలో విద్యాసాగర్ రావు ఎంపీ గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు టిఆర్ఎస్ నాయకులు చేసిన అభివృద్ధి లేదని అన్నారు.పార్లమెంట్ సభ్యులు ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో జగిత్యాల- కరీంనగర్ కరీంనగర్-వరంగల్ వరకు NH563 రహదారి నిర్మాణ పనులకు 3,233.23 కోట్లు మరియు ఎల్కతుర్తి-సిద్దిపేట రహదారికి 650 కోట్లు కేటాయించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కి మరియు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మియాపూరం లక్ష్మణాచారి,ఎస్టి మోర్చా జిల్లా కార్యదర్శి మొగిలి శ్రీనివాస్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు సోన్నాకుల శ్రీనివాస్, వంగల ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్,యువమోర్చా మండల అధ్యక్షులు భాష బోయిన ప్రదీప్ యాదవ్, ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు ఆరెల్లి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కొండ్ర సురేష్ పాల్గొన్నారు.
Post a Comment