ఆంక్షలు ఎత్తి వేశారని అలక్ష్యం వద్దు: జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేసిన నేపథ్యంలో కరోనాను లైట్ తీసుకోవద్దని అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలను కోరుతున్నారు వైద్య నిపుణుల హెచ్చరికలను అనుసరించి కోవిడ్ అదుపులోకి మాత్రమే వచ్చిందని పూర్తిగా అంతమవ్వలేదు లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు అని ఆంక్షలు చేస్తే పరిస్థితులు జారిపోయే ప్రమాదం ముంచుకొస్తుంది. తప్పనిసరిగా మాస్కులు ధరించడం బహిరంగ ప్రదేశాల్లో జన సమూహ ప్రాంతాల్లో భౌతిక దూరాన్ని పాటించడం శానిటైజర్ ఉపయోగించడం తప్పనిసరి కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటిస్తూ అందుకు సంబంధించి ప్రభుత్వం సూచించిన నిబంధనలను అనుసరించాలి, మాస్కు ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా తో పాటు మేనేజ్ మెంట్ డిజాస్టర్ చట్టపరమైన చర్యలు తప్పవు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కోరినట్లు కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలి, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమె ప్రస్తుత కర్తవ్యం అని అన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post