ఆన్ లైన్ లోనే పాఠశాల తరగతులు: సీఎం కేసీఆర్ ఆదేశాలు



 తెలంగాణలో జూలై 1 నుంచి  స్కూళ్లు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ శనివారం మరోసారి స్పష్టం చేసింది. అయితే ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి..రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పట్లో ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని తెలిపారు. వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలన్నారు.

ఇటీవలే తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. ఆ సమయంలో..రాష్ట్ర ప్రభుత్వం జులై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతిచ్చింది. అయితే స్కూళ్లలో ప్రత్యక్ష బోధనా.. ఆన్ లైన్ బోధనా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. లేటెస్టుగా సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆన్ లైన్ బోధనే అనేది కన్ఫాం అయ్యింది.

అంతకు ముందు ఇదే విషయంపై..ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post