తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో ఐకేపీ సెంటర్ ను బిజెపి మానకోండూర్ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు  సందర్శించి  మాట్లాడారు రైతులు తమ ధాన్యాన్ని ఎండ పెట్టుకుంటూ మరియు ఆరపెట్టుకుంటూ అతివృష్టి అనావృష్టి తో కురిసిన  వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి ధాన్యపు గింజ లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పిన కెసిఆర్ తన మాట నిలబెట్టుకోవాలని ఈ కొనుగోలు కేంద్రాలు నెల నుండి ఆలస్యానికి కారణం ఈ రవాణా విధానం మరియు ఐకేపీ సరియైన పద్ధతిలో ఎగుమతి మరియు దిగుమతి వెనుకబడి ఉండడంలో ఈ ఒక్క కారణం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం  మొండివైఖరి తక్షణమే గింజ లేకుండా  కొనుగోలు చేసి అతివృష్టితో అనావృష్టితో  అకాల వర్షం కురవడం వల్ల తడిసిన ధాన్యాన్ని A గ్రేడ్ లో కొనుగోలు చేయాలని ప్రస్తావించడం జరిగింది మరియు రైతుల కన్నీరు మరియు వర్షపునీరు ఏకమై పారుతున్న పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది


ఈ కార్యక్రమంలో బిజెపి గన్నేరువరం మండల అధ్యక్షులు నగునూరి శంకర్ మరియు గడ్డం సుమిత్ రెడ్డి మరియు బీజేవైఎం మీడియా కన్వీనర్ మచ్చ మురళికృష్ణ, రైతులు : చింతలపల్లి వెంకటరెడ్డి, మల్లారెడ్డి, కాటపల్లి చుక్కరెడ్డి, సుమిత్ రెడ్డి,సంపత్ రెడ్డి, కల్లేపల్లి మల్లయ్య, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post