ఒక్క వర్షానికే మునిగిన ముంబై ... సబర్బన్ రైల్వే సర్వీసులు మూత



 భారత దేశ ఆర్థిక రాజధాని ముంబై నిన్న ఒక్క వర్షానికే కకావికలమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నడుము లోతులో నీళ్లు చేరాయి. రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకీతాకగానే వర్షాలు బీభత్సం సృష్టంచాయి. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమైన వాన మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఏకధాటిగా దంచికొట్టింది.


ఒక్కసారిగా కురిసిన కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి పెద్ద ఎత్తున నీళ్లు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు సబ్‌వేలను పోలీసులు మూసివేశారు. రైల్వే ట్రాక్‌లపైకి నీళ్లు చేరడంతో సబర్బన్ రైలు సర్వీసులను నిలిపివేశారు. నిన్న శాంతాక్రజ్‌లో అత్యధికంగా 164.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


రుతుపవనాలు తాకిన తొలి రోజే ఈ స్థాయిలో వర్షం కురవడం గమనార్హం. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముంబై సహా థానే, పాల్ఘడ్, రాయ్‌గడ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.




0/Post a Comment/Comments

Previous Post Next Post