తెలంగాణ లో ఈ రోజు ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్ లైన్ తరగతులు వాయిదా



 ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు,   ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, నిన్న  చేసిన మరో ప్రకటనలో, ఈరోజు  ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్ లైన్ తరగతులను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఆన్ లైన్ క్లాసులు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తేదీ ప్రకటిస్తామని వివరించారు. ఇక, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల కోసం రేపటి నుంచి (www.tsbie.cgg.gov.in) ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post