చైనా బార్డర్ కు అదనంగా 50 వేల మంది సైనికులను తరలించిన భారత్

 బార్డర్ లో  చైనా దురాగతాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు నీతి వాక్యాలు చెపుతూనే, మరోవైపు ఉద్రిక్తతలు పెరిగేలా వ్యవహరిస్తోంది. దీంతో అణుశక్తి కలిగిన రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దుల్లోకి అదనంగా మరో 50 వేల మంది సైనికులను పంపించింది. ఫైటర్ జెట్స్ ను కూడా సరిహద్దులకు తరలించింది. చైనా సరిహద్దుల్లోని మూడు వ్యూహాత్మక ప్రాంతాలకు బలగాలను తరలించింది. ప్రస్తుతం బోర్డర్లలో 2 లక్షల మంది సైనికులు విధుల్లో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ.



1962 నుంచి ఇండియా, చైనా మధ్య శశత్రుత్వం పెరిగింది. మన దేశం కేవలం పాకిస్థాన్ మీదే ఫోకస్ చేస్తున్న తరుణంలో... మరో వైపు నుంచి చైనా దొంగ దెబ్బ తీసింది. ఆ వైరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే, భారత్ సైనిక పరంగా, అణ్వాయుధాల పరంగా భారత్ బలంగా ఉండటంతో, నేరుగా ఢీకొనేందుకు చైనా వెనకడుగు వేస్తోంది. కానీ, దొంగచాటున సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు. ఈ నేపథ్యంలో సరిహద్దులకు భారత ప్రభుత్వం బలగాలను పెద్ద సంఖ్యలో తరలించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే దిశగా కార్యచరణను కొనసాగిస్తోంది. క్షణాల్లో సైనికులను సరిహద్దుల్లోకి తలించేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లను మోహరింపజేసింది.


మరోవైపు సరిహద్దుల్లో చైనా ఏ మేరకు సైనికులను మోహరించిందనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ... హిమాలయా రీజన్ లో వారి సైనిక కదలికలు ఎక్కువయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బలగాల మోహరింపుపై ఇరు దేశాలు ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ప్రస్తుత పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post