డాక్టర్ కె.రమేష్ రెడ్డి కి వి ఎస్ యూ అశ్రునివాళి



 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్  మరియు స్టేట్ ఎన్ ఎస్ ఎస్ కోర్డినేటర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు నిన్న కోవిడ్ 19 కారణంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ హఠాత్మరణం చెందారు. ఇంచార్జి ఉపకులపతి కే. రాజశేఖర్ గారు మరియు ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు ఆంధ్ర ప్రదేశ్  స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య కే హేమ చంద్ర రెడ్డి గారు తమ  ప్రగాఢ సానుభూతి  మరియు నివాళి రిజిస్ట్రార్ గారికి ఫోన్ ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా  విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయిర్, ఇతర అధ్యాపకులు,  సిబ్బంది సమావేశ మందిరంలో రమేష్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిముషాలు మౌనము పాటిస్తూ నివాళు  అర్పించారు. రాష్ట్రము లోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, మాజీ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు, రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు తమ నివాళు  మరియు వారి కుటుంబానికి సానుభూతిని ఫోన్ ద్వారా రిజిస్ట్రార్ కి తెలిపారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు మరియు ఇతర సిబ్బంది రమేష్ రెడ్డి మరణం తెలుసుకుని తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు, వారి కుటుంబానికి తోడుగు నిలుస్తామని తీర్మానించడం జరిగినది.

0/Post a Comment/Comments

Previous Post Next Post